Header Banner

పాకిస్థాన్ కు భారత్ మరో షాక్! ఆ కీలక డ్యామ్ నుండి నీరు కట్!

  Sun May 04, 2025 15:41        India

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలూ ఇప్పటికే పరస్పరం ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసే ఏ చిన్న అవకాశాన్నీ భారత్ వదులుకోవడం లేదు. ఇప్పటికే సిందు నది ఒప్పందం అమలును నిలిపేయాలని నిర్ణయించిన భారత్.. అందులో భాగంగా పాకిస్తాన్ కు వెళ్లే నీటికి బ్రేకులు వేయడం ప్రారంభించింది.

 

జమ్మూలోని చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట ద్వారా భారతదేశం నీటి ప్రవాహాన్ని నిలిపివేసిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అలాగే జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ఆనకట్ట వద్ద కూడా నీటి నిలిపివేతను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూలోని రాంబన్‌లోని బాగ్లిహార్, ఉత్తర కాశ్మీర్‌లోని కిషన్‌గంగా వద్ద ఈ జలవిద్యుత్ ఆనకట్టలు ఉన్నాయి. భారతదేశానికి నీటి విడుదల సమయాన్ని నియంత్రించే సామర్థ్యం భారత్ కు ఉంది. దీన్ని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

 ఇది కూడా చదవండి: గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అమెరికా ఆదేశాలు! అవి చూపిస్తేనే విమానంలోకి ఎంట్రీ!

 

జమ్మూ, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన నేపథ్యంలో భారత్ పొరుగుదేశం పాకిస్తాన్ పై చర్యలకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడుకుంటోంది. ఇప్పటికే దిగుమతుల్ని సైతం నిలిపేసిన కేంద్రం.. ఇప్పుడు నీటి నిలిపివేత ద్వారా గట్టి సంకేతం ఇచ్చినట్లయింది. ఇప్పటికే సింధు నది నీటిని ఆపేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ పాకిస్తాన్ రాజకీయ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నా భారత్ ఇలా బాగ్లీహార్ డ్యామ్ నీటిని నిలిపేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

వాస్తవానికి బాగ్లిహార్ ఆనకట్ట భారత్-పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా వివాదంలో ఉంది. పాకిస్తాన్ గతంలో ఈ డ్యామ్ పై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వాన్ని కూడా కోరింది. ఇప్పుడు భారత్ నీటి నిలిపివేతతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే మరో ప్రాజెక్టు కిషన్‌గంగా ఆనకట్ట కూడా ప్పటికే చట్టపరమైన, దౌత్యపరమైన వివాదాల్లో ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IndiaPakistan #WaterDispute #IndusWaters #PakistanShock #DamPolitics